అల్లూరి సీతారామరాజు జిల్లా: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లలో తాము విజయం సాధించామని ఏపీ డీజీపీ హరీస్‌కుమార్ గుప్తా స్పష్టం చేశారు. ఈ ఎన్‌కౌంటర్లలో హిడ్మా, టెక్ శంకర్‌తో పాటు 13 మంది చనిపోయారన్నారు. మొత్తం 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామన్నారు. రెండు ఆపరేషన్లలో అన్ని పోలీస్ విభాగాలు సక్సెస్‌గా పనిచేశాయన్నారు. ఆపరేషన్‌లో భారీ పేలుడు పదార్థాలు లభ్యమమైనట్లు డీజీపీ తెలిపారు.
జూన్‌లో ఒక ఎక్సేంచ్ ఫైర్ జరిగిందని, సరెండర్ కావాలని గతంలోనే చెప్పామన్నారు. ఈ ఆపరేషన్‌ను ఒక లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్లామన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చుతామన్నారు. హింసకు రాష్ట్రంలో చోటు లేదన్నారు. ఆపరేషన్ డిటైల్స్ వెల్లడించమని, కాకపోతే ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందన్నారు. దేవ్‌జీ తమ అదుపులో లేరని డీజీపీ పేర్కొన్నారు.


