టీడీపీ రిగ్గింగ్‌ చేస్తోందని చెప్పినా పోలీసులు స్పందించలేదు: అనిల్‌ కుమార్‌ | Sakshi
Sakshi News home page

టీడీపీ రిగ్గింగ్‌ చేస్తోందని చెప్పినా పోలీసులు స్పందించలేదు: అనిల్‌ కుమార్‌

Published Thu, May 23 2024 1:22 PM

YSRCP Anil Kumar Yadav Questioned By EC Over TDP Violence

సాక్షి, తాడేపల్లి: ఎన్నికల కమిషన్‌ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంల ధ్వంసం వీడియోలను ఎవరు బయటపెట్టారో చెప్పాలన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌.

కాగా, అనిల్‌ కుమార్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడిపై కూడా దాడులు చేశారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారు. తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. టీడీపీ రిగ్గింగ్‌ చేస్తోందని పోలీసులకు చెప్పినా స్పందించలేదు. పాల్వాయి గేటు ప్రాంతంలో టీడీపీ నేతలు విధ్వంసం చేశారు. టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు?. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు.

ఎనిమిది చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది. ఈవీఎం ధ్వంసం వీడియోలను ఎవరు బయటపెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీని కనపడలేదా?. పోలింగ్‌ రోజు పోలీసుల వైఖరి ఈసీకి కనపడలేదా?. ఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం. టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిన చోట్ల రీపోలింగ్‌ పెట్టాలి’ అని డిమాండ్‌ చేశారు. 

దమ్ముంటే ఆ ప్రాంతంలో రీపోలింగ్ పెట్టాలి

నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్ది అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్

- ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్... అల్లర్లపై  చర్యలు తీసుకోలేదు.

- టీడీపీ నేతలు సత్యహరిచంద్రులు అన్నట్లుగా  ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోంది.

- మాచర్లలో జరిగిన ఎన్నికల హింస, అల్లర్లపై ఎన్నికల కమిషన్ ఎందుకు మౌనంగా ఉంది.?

- మాచర్ల నియోజకవర్గంలో అధికారులను మార్చిన తరువాతనే దాడులు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

- మాచర్లలో టిడిపి అల్లర్లకు పాల్పడవచ్చని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందు నుంచి ఈసికి లేఖలు రాస్తూనే ఉన్నారు.

- మాచర్లలో జరిగిన అన్నిసంఘటనలపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి.

- మాచర్లలో పలుప్రాంతాలలో రిగ్గింగ్ జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బిసిలపై దాడులు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీకి ఫోన్ చేస్తే ఏమాత్రం స్పందించలేదు.

- టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న చోట SP సహకారం అందించాడు. టిడిపి రిగ్గింగ్ పై  ఎస్పి స్పందించకపోతే పిన్నెల్లి  వెళ్లి అడ్డుకున్నారు.

- పాల్వాయి గేట్ వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు తలను టిడిపి గుండాలు పగలకొట్టినా పోలీసులు స్పందించలేదు

- ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ డే రోజున తొమ్మిది EVMలు ధ్వంసం అయితే  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్క వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చింది.?

- మాచర్లలోను, మిగతా నియోజకవర్గాల పరిధిలో EVMలు పగులగొట్టినచోట ఎందుకు చర్యలు తీసుకోలేదు, వీడియోలు బయటకు ఇవ్వలేదు.?

-  మొత్తం 9 సంఘటనలు EVMల ధ్వంసం జరిగితే కేవలం 1 మాత్రమే వీడియో ఎలా బయటకు వచ్చింది.? మిగిలిన 8 వీడియోలు బయటకు ఎందుకు రాలేదు.?

- గొడవలకు టిడిపి కారణం కాదు అని చెప్పాలనే ఈసి ప్రయత్నంగా కనిపిస్తోంది.!

- వీడియో ఎలా బయటకు వచ్చిందో ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి.

- అసలు వీడియో బయటకు ఎలా వచ్చింది? వారిపై చర్యలు తీసుకోరా.?

-  వీడియో ఎలా బయటకు వచ్చిందో విచారణ కేంద్ర ఎన్నికల సంఘం జరిపించాలని డిమాండ్ చేస్తున్నా

- ఒక సామాజిక వర్గం అధికారులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం నేతలు రిగ్గింగ్ చేసారు.

- టిడిపి ఎంపీ అభ్యర్ది లావు కృష్ణ దేవారాయులు సుధ్ద పూసలాగా మాట్లాడుతున్నారు

- మాకు పోలీసులు సహకరించలేదు. బందోబస్తు పెట్టలేదు అని ఆయన మాట్లాడుతున్నారు

- పల్నాడు ఎస్పి దాడులు జరుగుతున్న గ్రామాల్లోకి మాత్రం రాకుండా పక్క గ్రామాలలో తిరిగారు.

- మాచర్లలో రెండు రోజుల ముందు ఓ పధకం ప్రకారం పోలీసులను మార్చారు. ఎంపీ సామాజిక వర్గానికి చెందిన పోలీసులను నియమించుకున్నారు.

- ఏది ఏమైనా  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ ఘన విజయం సాధిస్తారు.

- తుమృకోటలో రిగ్గింగ్ జరిగుతుందని నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్పికి తెలియచేశాను

- తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నారని చెప్పినా SP కనీసం స్పందించలేదు. నన్ను రమ్మని చెప్పి అక్కడకు వెళ్లేసరికి ఎస్పీ అక్కడ లేరు.

- న్యాయ పోరాటం చేస్తాం. ఓటు వేసేందుకు వెళ్లకుండా ఎమ్మెల్యేను పోలీసులు  అడ్డుకున్నారు.

- ఎంఎల్ఏ స్వగ్రామమైన కండ్లగుంట, పక్క గ్రామం కేపి గూడెంలో ఇద్దరు డిఎస్పీలను  పెట్టారు

- టిడిపి రిగ్గింగ్ కు పాల్పడుతున్న ఒప్పిచర్ల, తుమృకోట, పాల్వాయి గేట్, చింతపల్లిలో మాత్రం నామమాత్రంగా పోలీసులను పెట్టారు.

- ఈ గ్రామాలలో పోలింగ్ బూత్ ల వీడియో ఫుటేజ్ బయటపెట్టండి. పోలీసుల సహకారంతో రిగ్గింగ్ జరిగిన విషయం బయటకువస్తుందని బయటపెట్టడం లేదు.

- ఈ గ్రామాలలో రీ పొలింగ్ పెట్టాలని అడిగినా ఈసి స్పందించలేదు.

- ముటుకూరు గ్రామంలో ఎస్సిబిసిలను భయభ్రాంతులకు గురిచేశారు. తుమృకోటలో ఇనుప రాడ్లతో టిడిపి వాళ్ళు ఈవిఎంను పగులగొట్టారు.

- పోతురాజుగుంటలో బుడగ జంగాల ఇళ్ళపై దాడి చేసి లూటి చేసిన మాట నిజం కాదా.

- కృష్ణదేవరాయలు ఫోన్ రికార్డ్ చూసుకోండి అని సత్యహరిచ్చంద్రుల్గా అంటున్నారు. వాట్సప్ కాల్ మాట్లాడితే రికార్డు ఉండదని అందరికి తెలుసు.

- సత్తెనపల్లిలో నాలుగు రీపోలింగ్ అడిగితే స్పందించలేదు.

- ప్రజలు వైయస్సార్ సిపి వెంట ఉన్నారు. తిరిగి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

- ఎంఎల్ఏ వాళ్ళ తమ్ముడు నియోజకవర్గంలో తిరగకుండా చేయాలని పోలీసులు చూశారు.

- సత్తెనపల్లి, కొత్తగణేషుని పాడులో ఘర్షణలు జరుగుతున్నా కూడా ఎస్పీ అక్కడకు వెళ్లలేదు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement