పాలన గాలికొదిలేసి కొట్లాట: షర్మిల | YS Sharmila comments at nizam sagart public meeting | Sakshi
Sakshi News home page

పాలన గాలికొదిలేసి కొట్లాట: షర్మిల

Oct 14 2022 4:10 AM | Updated on Oct 14 2022 8:07 AM

YS Sharmila comments at nizam sagart public meeting - Sakshi

ప్రజలకు అభివాదం తెలుపుతున్న షర్మిల   

సాక్షి, నిజాంసాగర్‌ (జుక్కల్‌): రాష్ట్రంలో పరిపాలన గాలి కొదిలేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ నేతలు మునుగోడు ఉప ఎన్నికలో కుక్కల్లా కొట్లాడుతున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. గురువారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రజా ప్రస్థాన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

ఉప ఎన్నికల్లో ఊరికొక ఎమ్మె ల్యేను ఇన్‌చార్జిగా నియమించి మందు సీసాలు, నాటుకోళ్లు, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసి ఓట్లు కొంటున్నారని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ తన బిడ్డను కాపాడుకోవడానికి ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకుంటున్నారన్నారు. రెండుసార్లు సీఎం అయిన కేసీఆర్‌ అభివృద్ధిని విస్మరించి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ బతికి ఉంటే డిండి ప్రాజెక్టు పూర్తి చేసి ఆయకట్టు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేవారన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు కాలువల మరమ్మతులకు రూ.450 కోట్లు కేటాయించిన ఘనత వైఎస్సార్‌దేనని షర్మిల స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement