సంక్రాంతి తర్వాత.. కార్యకర్తలతో జగనన్న | YS Jagan Mohan Reddy For Districts Tour After Sankranti | Sakshi
Sakshi News home page

సంక్రాంతి తర్వాత.. కార్యకర్తలతో జగనన్న

Published Fri, Nov 29 2024 6:22 PM | Last Updated on Fri, Nov 29 2024 8:32 PM

YS Jagan Mohan Reddy For Districts Tour After Sankranti

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లే క్రమంలో.. జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారాయన. సంక్రాంతి తర్వాత ఈ పర్యటనలు ప్రారంభం కానున్నట్లు తెలిపారాయన.

తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో ఇవాళ వైఎస్‌ జగన్‌ సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే ఆయన జిల్లాల పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’’ కార్యక్రమం పేరిట జిల్లాలకు జగన్‌ వెళ్లనున్నారు. ఈ పర్యటనల్లో నేరుగా పార్టీ కార్యకర్తలతో వైఎస్‌ జగన్‌ భేటీ కానున్నారు. ప్రతీ బుధ,గురువారాల్లో పూర్తిగా వాళ్లతోనే ఉండనున్నారు. వాళ్ల నుంచి పార్టీ బలోపేతానికి సలహాలు తీసుకోనున్నారు. 

ఇందుకోసం రోజూ 3 నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అలాగే ప్రతీ పార్లమెంట్‌ నియోజక వర్గంలో సమీక్షలు జరపనున్నారు. వైఎస్‌ జగన్‌ జిల్లాల పర్యటనలకు సంబంధించి పార్టీ ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. 

వైఎస్ జగన్ గూస్‌బంప్స్ స్పీచ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement