వివాదంలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య | Yadavendra Singh Objects To Arvind Kejriwal Photo | Sakshi
Sakshi News home page

వివాదంలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య

Apr 5 2024 8:14 PM | Updated on Apr 5 2024 8:29 PM

Yadavendra Singh Objects To Arvind Kejriwal Photo - Sakshi

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునితా కేజ్రీవాల్‌ వివాదంలో చిక్కుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్, బీఆర్‌ అంబేద్కర్‌ మధ్యలో ఆమె భర్త, మద్యం కేసులో అరెస్టైన అరవింద్‌ కేజ్రీవాల్‌ ఫోటో పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

అరవింద్ కేజ్రీవాల్ ఫోటోపై  భగత్‌ సింగ్‌ మునిమనవడు యాదవేంద్ర సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘నేటి రాజకీయాలు వ్యక్తిగతంగా మారుతున్నాయి. ప్రజలకన్న వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాజకీయాలు జరుగుతున్నాయి. ఏ నాయకుడిని ఆయనతో (భగత్‌సింగ్‌) పోల్చకూడదు. ఆయన దేశం, సమాజం కోసం కృషి చేశారు. సొంత ప్రయోజనాలు చూసుకోలేదు’ అని అన్నారు.  

ఆమ్ ఆద్మీ పార్టీ పొరపాటున ఇలా చేసి ఉంటే, దానిని సరిదిద్దాలని, అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాల మధ్య ఉంచిన కేజ్రీవాల్ ఫోటోను తొలగించాలని యాదవేంద్ర సింగ్ డిమాండ్‌ చేశారు. 

అంతకుముందు, ఈ చిత్రంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించింది. కేజ్రీవాల్ నిందితుడని, భగత్ సింగ్ డాక్టర్ అంబేద్కర్ లాంటి దేశభక్తుల మధ్య అతని ఫోటోను ఉంచడం ఆప్ వారి గౌరవాన్ని కించపరిచిందని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement