Maktal Constituency Political History In Telugu, Know MLA Candidates Who Won And Who Lost - Sakshi
Sakshi News home page

Maktal Political History: మక్తల్‌ నియోజకవర్గంలో అధికారం వహించేది ఎవరు?

Published Sat, Aug 5 2023 5:19 PM

Who Is Ruling In Maktal Constituency - Sakshi

మక్తల్‌ నియోజకవర్గం

మక్తల్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీచేసిన చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి మూడోసారి విజయం సాదించారు. గతంలో ఆయన ఒక ఉప ఎన్నికతో సహా రెండు సార్లు కాంగ్రెస్‌ఐ  పక్షాన పోటీచేసి గెలిచారు. 2014లో కాంగ్రెస్‌ ఐ తరపున గెలిచి, తదుపరి పరిణామాలలో ఆయన టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 2018లో  టిఆర్‌ఎస్‌ అభ్యర్దిగా తన సమీప ప్రత్యర్ది, ఇండిపెండెంట్‌ అభ్యర్ధి జలంధర్‌ రెడ్డిపై 48315 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. రామ్మోహన్‌ రెడ్డికి 78686 ఓట్లు రాగా, జలందర్‌ రడ్డికి 30371 ఓట్లు వచ్చాయి.

మహకూటమిలో భాగంగా ఇక్కడ టిడిపి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే  కొత్తకోట దయాకరరెడ్డికి దాదాపు 25,800 ఓట్లు వచ్చాయి. రామ్మోహన్‌ రెడ్డి మూడుసార్లు గెలిస్తే ఆయన తండ్రి నర్సిరెడ్డి గతంలో మూడుసార్లు గెలిచారు. రామ్మోహన్‌ రెడ్డికి మాజీ మంత్రి డికె.అరుణ సోదరి అవుతారు. 2009 ఎన్నికలలో టిడిపి నేత దయాకరరెడ్డి, ఆయన భార్య సీత ఇద్దరూ గెలుపొంది చట్టసభకు వెళితే 2014లో  ఇద్దరూ ఓటమి చెందారు. నారాయణ పేట నుంచి 2014లో మక్తల్‌కు మారిన మాజీ మంత్రి ఎల్లారెడ్డి కూడా ఓటమి చెందారు.

చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌ ఐ అభ్యర్ధిగా రంగంలో దిగి వీరిద్దరిని ఓడిరచడం విశేషం. ఎల్లారెడ్డి గతంలో టిడిపిలో ఉండి 2014లో టిఆర్‌ఎస్‌లోకి మారినా ఓడిపోవలసి వచ్చింది. మక్తల్‌లో ఏడుసార్లు రెడ్డి సామాజికవర్గం, ఆరుసార్లు బిసి సామాజికవర్గాలు మూడుసార్లు ఇతరులు గెలుపొందారు. రెండు సార్లు ఎస్‌.సి.నేతలు గెలిచారు. మక్తల్‌ నియోజకవర్గంలో  కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐలు కలిసి పదిసార్లు టిడిపి మూడుసార్లు జనతా, జనతాదళ్‌, టిఆర్‌ఎస్‌  ఒక్కొక్కసారి గెలుపొందాయి.  1952, 57లలో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది.

ఇక్కడ నుంచి కళ్యాణి రామచంద్రరావు మూడుసార్లు, సి. నర్శిరెడ్డి మూడుసార్లు గెలవగా, వై.ఎల్లారెడ్డి ఇక్కడ రెండుసార్లు, కొత్తగా ఏర్పడిన నారాయణపేటలో ఒకసారి గెలుపొందారు. నర్సిరెడ్డి 2009లో గెలిచాక నక్సల్స్‌ తూటాలకు బలెపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు రామ్మోహనరెడ్డి గెలిచారు. కాని 2009లో గెలవలేకపోయారు. తిరిగి 2014, 2018లలో గెలవగలిగారు. నర్శిరెడ్డి కుమార్తె డి.కె. అరుణ గద్వాల నుంచి గెలిచి మంత్రి అయ్యారు.

2014లో సోదరి, సోదరులైన అరుణ, రామ్మోహన్‌ రెడ్డిలు శాసనసభలో ఉన్నారు.  ఇక్కడ గెలిచిన వారిలో ఇద్దరు మంత్రులు అయ్యారు. కళ్యాణి రామచంద్రరావు గతంలో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో ఉంటే, ఎల్లారెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 1952లో ఇక్కడ గెలిచిన శాంతాబాయి, కల్వకుర్తిలో రెండుసార్లు, హైదరాబాదులోని గగన్‌మహల్‌ ఒకసారి మొత్తంమీద నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారు.

మక్తల్‌ నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Advertisement

తప్పక చదవండి

Advertisement