హోరాహోరీ: దీదీనా? మోదీనా?

West Bengal Election Results Mamata seeks third term despite tough fight from BJP - Sakshi

 ఉత్కంఠ భరితంగా బెంగాల్‌ పోరు

 ప్రారంభమైన కౌంటింగ్‌ : గెలిచేదెవరు

సాక్షి,కోలకతా : దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రధానంగా బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పశ్చిమ బెంగాల్‌ పీఠం ఎవరికి దక్కనుందనే అంశానికి ఈ రోజు తెరపడనుంది. వరసగా మూడోసారి అధికార పీఠాన్ని ఎలాగైనా  నిలబెట్టుకోవాలని తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆశిస్తుండగా, టీఎంసీ కోటలో పాగా వేయాలని బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో కదిలింది. ఈ నేపథ్యంలో  అధికార పార్టీ టీఎంసీకి, బీజేపీ మధ్య హోరాహోరీగా నడిచిన  ఈ పోరులో ఉత్కంఠకు నేటితో తెరపడనుంది.

టీఎంసీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నందీగ్రామ్‌లో దీదీ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. టీఎంసీ మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీ తరపున ఇక్కడ బరిలో ఉన్న సువేందు  అధికారి  ముందంజలో ఉన్నారు. దీంతో మరింత ఉత్కంఠ పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది దఫాలుగా పోలింగ్‌ నిర్వహించిన బెంగాల్‌ కోటలో అధికార పీఠం ఎవరికి దక్కనుంది. ఈ టఫ్‌ ఫైట్‌లో నిలిచేదెవరు..గెలిచేదెవరు..?  దీదీనా, మోదీనా? దేశవ్యాప్తంగా ఇదే హాట్‌ హాట్‌టాపిక్‌. మెజార్టీ సర్వేలు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారం నిలబెట్టుకుట్టు కుటుందని అంచనా వేశాయి. కాగా బెంగాల్‌లో మొత్తం 292  సీట్లకు గాను పోలింగ్‌ జరిగింది. బెంగాల్‌లో అధికారంలోకి రావాలంటే 148 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) సాధించాలి. (బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు: లెక్కింపు ప్రారంభం)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top