
బహుశా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్ష పగ్గాలు చేపట్టొద్దని రాహుల్ భావించడం వల్లే తనను పోటీ చేయమన్నారని..
పట్నా: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయాలని తనకు కేవలం నామినేషన్ వేయడానికి 18 గంటల ముందు చెప్పారని పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం చెప్పారు. బహుశా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్ష పగ్గాలు చేపట్టొద్దని రాహుల్ భావించడం వల్లే తనను పోటీ చేయమన్నారని అభిప్రాయపడ్డారు.
‘కానీ రాహుల్ సారథ్యం పార్టీకి చాలా అవసరమన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఆయన సెంటిమెంట్లను గౌరవిస్తా’ అని చెప్పుకొచ్చారు మల్లికార్జున ఖర్గే. తాను అధ్యక్షుడినైతే పార్టీ ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలే తొలి ప్రాథమ్యంగా ఉంటుందన్నారు. ఈ ఎన్నికను పార్టీ అంతర్గత వ్యవహారంగా అభివర్ణించారు. ఎంపీ శశిథరూర్ కూడా అధ్యక్ష ఎన్నిక బరిలో దిగడం తెలిసిందే.
ఇదీ చదవండి: Bharat Jodo Yatra: రోడ్డుపైనే రాహుల్ పుషప్స్