18న బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి

Vikarabad: Ex Minister Chandrasekhar to Join BJP on Jan 18 - Sakshi

కాంగ్రెస్‌కు మాజీమంత్రి చంద్రశేఖర్‌ రాజీనామా

సాక్షి, వికారాబాద్‌: మాజీ మంత్రి, వికారాబాద్‌ మాజీ శాసనసభ్యుడు డాక్టర్‌ ఎ. చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు సోమవారం రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి పంపారు. పార్టీలో నిబద్ధత గల నాయకులకు గుర్తింపు లేకుండా పోయిందని, వెన్నుపోటుదారులకు పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. క్రమశిక్షణ కలిగిన తాను.. క్రమశిక్షణలేని కాంగ్రెస్‌లో ఇమడలేక పోతున్నానని పేర్కొన్నారు. కాగా, చంద్రశేఖర్‌ ఈనెల 18న వికారాబాద్‌లో బీజేపీలో చేరనున్నారు.

1985 నుంచి 2008 వరకు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఎన్నికయ్యారు. నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు. తర్వాత టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి కూడా రాజీనామా చేశారు.

చదవండి:
మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నిక

'కూకట్‌పల్లిలో బండి సంజయ్‌కు వ్యాక్సిన్‌ వేశా'

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top