ఆమె జాతీయ నాయకురాలో లేక జాతి నాయకురాలో..

Vijaya Sai Reddy Slams BJP Leader Daggubati Purandeswari  - Sakshi

సాక్షి, తిరుమల: వైఎస్సార్‌ సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'పురందేశ్వరి ఈ రోజు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూతో, అందులో రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది' అంటూ ఎద్దేవా‌ చేశారు.  (అలా మొక్కారు.. ఇలా తొక్కారు!)

కాగా.. అంతకు క్రితం తిరుమ‌ల శ్రీవారిని ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే కొంత‌మంది రాజ్యాంగాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. అలాంటి వారికి బుద్దుని ప్రసాదించాలని దేవున్ని కోరుకున్న‌ట్లు తెలిపారు.(టీడీపీలో గర్జించిన అసమ్మతి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top