రాజ్యసభను నడిపిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి | Vemireddy Prabhakar Reddy Leads Rajya Sabha Panel Vice President | Sakshi
Sakshi News home page

రాజ్యసభను నడిపిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

Feb 5 2024 7:26 PM | Updated on Feb 5 2024 7:29 PM

Vemireddy Prabhakar Reddy Leads Rajya Sabha Panel Vice President - Sakshi

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యులు, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఈ రోజు(సోమవారం) అరుదైన ఘనత దక్కించుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్‌ కుర్చీలో ఆసీనులై, ప్యానెల్‌ వైస్‌ ఛైర్మన్‌గా సభను నడిపించారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రాజ్యసభ ప్యానెల్‌ వైస్‌ ఛైర్మన్‌ హోదాలో.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ స్థానంలో కూర్చొని సభను సజావుగా నడిపించారు.

2018, ఏప్రిల్లో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకరెడ్డి పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌ నెలతో ముగియనుంది. ఈ సందర్భంగా రాజ్యసభ్యులుగా ఆయన అందించిన విశేష సేవలకు గుర్తుగా రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్ ప్యానెల్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఇటీవల ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఈ రోజు ఆయన ఛైర్మన్‌ స్థానంలో ఆసీనులై సభను నడిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement