‘బావ కళ్లల్లో ఆనందం కోసం ప్రభుత్వంపై బురద చల్లితే సహించం’ | Vellampalli Srinivas Comments On Balakrishna | Sakshi
Sakshi News home page

‘బావ కళ్లల్లో ఆనందం కోసం ప్రభుత్వంపై బురద చల్లితే సహించం’

Sep 13 2023 3:56 PM | Updated on Sep 13 2023 4:13 PM

Vellampalli Srinivas Comments On Balakrishna - Sakshi

బావ కళ్లల్లో ఆనందం కోసం ప్రభుత్వంపై బాలకృష్ణ బురద చల్లితే సహించేది లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు.

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: బావ కళ్లల్లో ఆనందం కోసం ప్రభుత్వంపై బాలకృష్ణ బురద చల్లితే సహించేది లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. పశ్చిమ నియోజక వర్గంలో పలు డివిజన్లలో పర్యటించిన వెల్లంపల్లి.. మీడియాతో మాట్లాడుతూ, భర్తను అరెస్ట్ చేస్తే భార్య బాధ పడటం సహజమని, చంద్రబాబుకి కోర్టులో మౌలిక సదుపాయాలు కల్పన విషయంలో ప్రభుత్వ న్యాయవాదులు ఎక్కడా అడ్డు పడలేదన్నారు.

టీడీపీ బంద్‌కి పిలుపునిస్తే హెరిటేజ్ సంస్థ వ్యాపారాలు చేసుకోవడం సిగ్గు చేటు. చంద్రబాబు స్కిల్ పేరిట దోచుకున్న సొమ్మును కక్కిస్తాం. లోకేష్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. వాళ్ల నాన్న చేతికి పెట్టుకున్న ఉంగరంలోని చిప్ ఇప్పుడు లోకేష్ పెట్టుకుంటే మంచిది’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు.
చదవండి: బాబు, పవన్‌ ఫెవికాల్ బంధం.. ఎవరేమైతే మాకేంటి? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement