అసెంబ్లీలో వీర్ సావర్కర్ చిత్రపటంపై రగడ.. నిరసనకు దిగిన ప్రతిపక్షం

అసెంబ్లీలో వీర్ సావర్కర్ చిత్రపటంపై రగడ.. నిరసనకు దిగిన ప్రతిపక్షం - Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజే ఆందోళనల పర్వం కొనసాగింది. శాసనసభలో వీర్ సావర్కర్‌ చిత్రపటాన్ని పెట్టడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. తమను సంప్రదించకుండా వివాదాస్పద వ్యక్తి ఫొటోను ఎలా పెడతారని మండిపడింది. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభ బయట ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనకు దిగారు.

ఈ సమావేశాల్లో ప్రభుత్వ అవినీతిపై తాము ప్రశ్నలు లేవనెత్తుతామని బొమ్మై సర్కార్‌కు తెలుసునని, అందుకే సభా కార్యకాలాపాలు జరగకుండా కావాలనే వీర్ సావర్కర్ బొమ్మ పెట్టారని డీకే శివకుమార్ ఆరోపించారు. ఇది చూసి తాము ఆందోళనలకు దిగుతామని బీజేపీకి తెలుసునని పేర్కొన్నారు. వెంటనే ఆయన ఫొటోను అసెంబ్లీ నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు వీర్ సావర్కర్‌పై తప్పుడు ప్రచారాన్ని పోగెట్టేందుకు తాము రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బీజేపీ చెబుతోంది. ఆయన గౌరవార్థమే అసెంబ్లీ ఫొటో పెట్టినట్లు పేర్కొంది. బెళగావితో ఆయనకు అవినావ సంబంధం ఉందని చెప్పింది.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో సావర్కర్ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సావర్కర్ బ్రిటిష్ వాళ్లకు భయపడి క్షమాభిక్ష కోరిన వ్యక్తి అని కాంగ్రెస్ చెబుతోంది. ఇది తప్పుడు ప్రచారం అని, ఆయన స్వతంత్ర సమరయోధుడని బీజేపీ వాదిస్తోంది.
చదవండి: ప్రధాని మోదీతో భేటీకి ముందు సీఎంకు షాక్..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top