Breadcrumb
Live Updates
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ పూర్తి
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ పూర్తైంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా.. పోలింగ్ అంతా ప్రశాంతంగానే సాగింది. కాగా బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం డబుల్ అవినీతిని తీసుకొచ్చిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు.
సాయంత్రం 5 గంటల వరకు 57.79 పోలింగ్
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 57.79% పోలింగ్‌నమోదైంది. ఘజియాబాద్‌లో 55.31% పోలింగ్ నమోదవ్వగా.. మీరట్‌లో 55.70% ఓటింగ్ నమోదైంది. మరోవైపు ఈవీఎంలు పనిచేయడం లేదని ఎక్కడ ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎన్నికల కమిషనర్‌ను కోరారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు 48.24 శాతం పోలింగ్ నమోదు
►ఉత్తరప్రదేశ్ మెదటి దశ పోలింగ్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.24 శాతం ఓటింగ్ నమోదైంది.
►లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలోని నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా..బెయిల్ పొందడంతో ఆర్ఎల్డీ నాయకుడు జయంత్ చౌదరి బీజేపీపై విరుచుకుపడ్డారు. నలుగురు రైతులను హతమార్చిన నిందితుడికి నాలుగు నెలల్లో బెయిల్ లభించిందని చౌదరి ట్విట్టర్లో పేర్కొన్నారు.
क्या व्यवस्था है!!
— Jayant Singh (@jayantrld) February 10, 2022
चार किसानों को रौंदा, चार महीनों में ज़मानत…
మధ్యాహ్నం 1 గంట వరకు 35శాతం పోలింగ్
ఉత్తర ప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో జరుగుతున్న మొదటి దశ పోలింగ్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 35.03 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా అత్యధికంగా శామ్లి జిల్లాలో 41.6 శాతం పోలింగ్ నమోదయింది. అ ముజఫర్ నగర్లో 35.73 శాతం, మీరట్ 34.51, బాఘ్‌పత్ 38.02, ఘజియాబాద్ 33.40, హాపూర్ 39.97, గౌతంబుద్ధ్‌నగర్ 30.53, బులంద్ షహర్ 37.03, అలీగఢ్ 32.07, మధుర 36.26, ఆగ్రాలో 36.93 శాతం పోలింగ్ నమోదయింది.
35.03% voter turnout recorded till 1pm in the first phase of #UttarPradeshElections2022 pic.twitter.com/vrkvVC05LM
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 10, 2022
ఓటు వేసిన కేంద్ర మంత్రి
తొలిదశ పోలింగ్‌లో భాగంగా ముజఫర్‌నగర్‌లో కేంద్ర మంత్రి డాక్టర్ సంజీవ్ బల్యాన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ముజఫర్‌నగర్ ప్రాంతాన్ని క్రైమ్ క్యాపిటల్‌గా పిలిచేవారని అన్నారు. నేడు శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని, అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం మాఫియా రాజ్యం అంతమైందని పేర్కొన్నారు. పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు.
ఉదయం 11 గంటల వరకు 20.03 శాతం ఓటింగ్
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.03 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
ఓటుకు దూరంగా ఆర్ఎల్డీ చీఫ్ జయంత్
మధురలో తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ర్యాలీ కారణంగా ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి తొలిదశ పోలింగ్‌లో ఓటు వేయలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు మధుర ప్రాంతంలో ఓటు హక్కు ఉంది.
యూపీలో కొనసాగుతున్న తొలిదశ ఎన్నికల పోలింగ్
ఓటర్లకు పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ
భారీ ఎత్తున తరలివచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
देश को हर डर से आज़ाद करो-
— Rahul Gandhi (@RahulGandhi) February 10, 2022
बाहर आओ, वोट करो!
పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది: షామ్లీ జిల్లా కలెక్టర్
పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు. షామ్లీ జిల్లా కలెక్టర్ జస్జిత్ కౌర్ మాట్లాడుతూ.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు సంబంధించి ఫిర్యాదులు అందాయని, ఈవీఎంల సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని, ఎక్కడా శాంతిభద్రతల సమస్య లేదని తెలిపారు.
ఓటు వేసిన బేబీ రాణి మౌర్య
ఆగ్రా రూరల్ బీజేపీ అభ్యర్థి బేబీ రాణి మౌర్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుపరిపాలన కోసం ఓటర్లు బీజేపీ అనుకూలంగా ఓటు వేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
తొలి దశలో 2.27 కోట్ల మంది ఓటర్లు
తొలిదశ పోలింగ్‌లో ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆర్ఎల్డీ-ఎస్పీ దోస్తీతో ఈ దఫా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారింది.
బహుముఖ పోరు
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో బహుముఖ పోరు నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ బరిలో.. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ- ఆర్ఎల్డీ, ఆప్, ఎంఐఎం పార్టీలు పోటీలో ఉన్నాయి.
2017 తొలి దశలో బీజేపీ హవా
2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలిదశలో 58 సీట్లకు పోలింగ్ జరగ్గా బీజేపీ 53 చోట్ల గెలుపొందింది.. చెరో 2 స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ, ఒక స్థానంలో ఆర్ఎల్డీ గెలుపొందాయి.
తొలిదశ పోరులో 9 మంది మంత్రులు
తొలిదశ పొలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానకి ఓటర్ల తరలివస్తున్నారు. తొలిదశ బరిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లోని 9 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కేబినెట్ మంత్రులైన శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గర్గ్, చౌధురి లక్ష్మీ నారాయణ్‌తో పాటు మరో ముగ్గురు మంత్రులు తొలిదశ పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తొలిదశ పోలింగ్‌లో 58 స్థానాలకు 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలిదశలో మొత్తం 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 6 గంటల వరకు కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Related News By Category
Related News By Tags
-
క్రీడాకారులకు యూపీ కేబినెట్ ఊరట
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ క్రీడాకారులకు చెప్పుకోదగ్గ ఊరటనిచ్చింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలతో రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెస్తున్న క్రీడాకారులకు ఉద్యోగాలు కలి్పస్తోంది. కానీ ఈవెంట...
-
మాస్క్‌తో పలాష్ : ప్రేమానంద్ మహారాజ్‌ని ఎందుకు కలిశాడు?
స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ (Palaash Muchhal) వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఇంకా భారీ ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిసెంబరు 7న వీరిద్ధరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నా...
-
17 ఏళ్లకే ఏఐ రోబో టీచర్‌తో సంచలనం
ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఆదిత్య కుమార్ సంచలనంగా మారాడు. ఆదిత్య కేవలం రూ.25 వేలతో ఏఐ రోబో టీచర్‌ను రూపొందించాడు. శివ చరణ్ ఇంటర్ కాలేజీకి చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్, ఎల్...
-
రూపాయి చాలు!
వరకట్నం మహమ్మారి కోరల్లో చిక్కుకుని అనేక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి, అత్తింటి వేధింపులకు వధువుల బతుకులు బలవుతున్నాయి. సరిగ్గా అలాంటి పరిస్థితులలో.. అత్తింటివారు ఇచ్చిన రూ.31 లక్షల కట్నాన్ని ఒక వరు...
-
‘చీర్స్’బాబు చిక్కాడు
బహ్రైచ్ (యూపీ): చిరుతపులిని బంధించడానికి అటవీ శాఖ అధికారులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు.. దాన్ని పట్టుకోవడానికి బోను కూడా ఏర్పాటు చేశారు. చిరుత చిక్కలేదు.. కానీ అందులో ఒక మందుబాబు చిక్కుకుపోయాడు. ఫక్రూ...


