Jana Garjana Sabha: TPCC President Revanth Reddy Tweet On BRS Party - Sakshi
Sakshi News home page

జన గర్జన సభ.. బీఆర్‌ఎస్‌పై రేవంత్‌రెడ్డి ట్వీట్‌

Jul 2 2023 3:33 PM | Updated on Jul 2 2023 4:19 PM

Tpcc President Revanth Reddy Tweet On Brs Party - Sakshi

సాక్షి, ఖమ్మం: ఖమ్మం రాహుల్ గాంధీ జనగర్జన బహిరంగ సభతో తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి.. జనగర్జన సభ బహిరంగ సభ వేదిక ద్వారా రాహుల్ ఏం చెప్పబోతున్నారని పొలిటికల్‌గా సర్వత్ర ఆసక్తి మొదలైంది.. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఆ స్థాయిలోనే భారీ ఏర్పాట్లు చేశారు.

ఈ సభలో రాహుల్ సమక్షంలో పొంగులేటి ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా.. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా సభలో భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ ఘనంగా సన్మానించనున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ జన గర్జన సభ బీఆర్‌ఎస్‌ వెన్నులో వణుకు పుట్టిస్తోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. సభకు వచ్చే అశేష జన వాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తురన్నారని మండిపడ్డారు. అధికారులు పద్దతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేవంత్‌ హెచ్చరించారు. అర చెయ్యిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరన్న సత్యాన్ని ప్రభుత్వం గ్రహిస్తే మంచిదంటూ ఆయన వ్యాఖ్యానించారు.


చదవండి: కాంగ్రెస్‌లో నేను చేరగలను.. కానీ.. గద్దర్‌ కామెంట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement