తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు బిగుస్తున్న ఉచ్చు!

Telangana Minister Srinivas Goud In Election Affidavit Trouble - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్‌ గౌడ్‌ అక్రమాలకు పాల్పడినట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లను శ్రీనివాస్‌ గౌడ్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు తేలింది. అయితే లోపాలతో ఉన్న మొదటి అఫిడవిట్‌ను వెబ్‌సైట్‌ నుంచి తొలగించారని తేలింది. మళ్లీ సవరించిన అఫిడవిట్‌ను నెలన్నర తర్వాత  అప్‌లోడ్‌ చేసినట్లు ఆరోపణ వచ్చింది. 

కాగా,  స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపరింగ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారితో కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ నివేదిక తెప్పించుకుంది. నివేదిక పంపిన కొద్దిరోజులకే కేంద్రానికి సీఈవో శశాంక్‌ గోయల్‌ బదీలీపై వెళ్లారు. ట్యాంపరింగ్‌ జరిగిన విషయం నిజమేనంటూ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. నివేదిక ఆధారంగా ట్యాంపరింగ్ ఆరోపణలపై అంతర్గతంగా సాంకేతిక బృందంతో కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ జరిపిస్తోంది.   

గతేడాది ఆగస్టులో ఇచ్చిన ఈ ఫిర్యాదుపై ఇప్పడు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ట్యాంపరింగ్‌ను టెక్నికల్ బృందం ధృవీకరిస్తే ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం అవకాశం కనిపిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top