
హైదరాబాద్: ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన లైఫ్ సైన్సెస్ సదస్సు AusBiotech-2025లో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఆస్ట్రేలియా, విక్టోరియా ప్రభుత్వాలు ఆహ్వానించగా.. ఈ గౌరవం దక్కిన ఏకైక భారతీయ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
ఈ రోజు ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ Ms Hilary McGeachy, మంత్రి శ్రీధర్ బాబుని కలిసి.. AusBiotech 2025 ప్రాధాన్యతపై చర్చించారు. రెండు ప్రాంతాల మధ్య ఆరోగ్య రంగంలో నూతన ఆవిష్కరణలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), పరిశోధన భాగస్వామ్యాలు, ఆధునిక తయారీ రంగాల్లో సహకారం మరింత బలపడేలా చర్చలు జరిపారు.
తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగంలో గత రెండు సంవత్సరాల్లో రూ.63,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, ఫార్మా, బయోటెక్, మెడ్‌టెక్ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదిగిన నేపథ్యంలో ఈ ఆహ్వానం వచ్చింది. తాజా సీబీఆర్ నివేదిక ప్రకారం హైదరాబాద్ ప్రపంచంలోని టాప్ 7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ జాబితాలో చోటు దక్కిన ఏకైక భారత నగరంగా హైదరాబాద్ నిలిచింది.