ఇక్కడ అవకాశాలు పుష్కలం.. పెట్టుబడులు పెట్టండి | Telangana Role Model in Ease of Doing Business Says TS IT Minister Sridhar Babu | Sakshi
Sakshi News home page

ఇక్కడ అవకాశాలు పుష్కలం.. పెట్టుబడులు పెట్టండి

Nov 7 2025 4:48 PM | Updated on Nov 7 2025 6:15 PM

Telangana Role Model in Ease of Doing Business Says TS IT Minister Sridhar Babu

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచిన తెలంగాణలో అవకాశాలు పుష్కలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా - యూటా(Utah) పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.

వరల్డ్ ట్రేడ్ సెంటర్ - యూటా ఎండీ, సీవోవో డేవిడ్ కార్లెబాగ్ నేతృత్వంలోని ‘యూటా పారిశ్రామికవేత్తల బృందం’ శుక్రవారం సచివాలయంలో ఆయనను ప్రత్యేకంగా కలిసింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్, ఏఐ ఆధారిత హెల్త్ కేర్,  క్లీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్, స్కిల్స్ తదితర రంగాల్లో ‘యూటా–తెలంగాణ’ మధ్య ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాక, గ్లోబల్ ఎకానమీకి సపోర్ట్ ఇచ్చేలా, లాంగ్-టర్మ్ వాల్యూ క్రియేషన్ కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తీసుకొచ్చిన సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఏయే రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం, పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలు, పారిశ్రామికవేత్తలకిచ్చే ప్రోత్సాహాకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం టీ-హబ్, టీ- వర్క్స్, వీ హబ్ లను వరల్డ్ ట్రేడ్ సెంటర్ - యూటా, సిలికాన్ స్లోప్స్ & యూటా టెక్ స్టార్టప్‌లతో అనుసంధానించేలా చొరవ చూపాలని ప్రతినిధి బృందాన్ని ఆయన కోరారు.

ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో యూనివర్సిటీ ఆఫ్ యూటా, బీవైయూ, న్యూమాంట్ యూనివర్సిటీలతో కలిసి రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలు ఉమ్మడి అకడమిక్, రీసెర్చ్ ప్రోగ్రామ్ లను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘యూటా’ రాష్ట్రంతో పటిష్ఠమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ద్వైపాక్షిక సహకారం పెట్టుబడులకే పరిమితం కాకుండా  ఇన్నోవేషన్, స్కిల్స్, టెక్నాలజీ రంగాల్లోఉమ్మడి ఆవిష్కరణలకు దిక్సూచీగా మారాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు.

తెలంగాణ లాంటి ఫాస్ట్-గ్రోయింగ్, డైనమిక్, ప్రో-యాక్టివ్ రాష్ట్రంతో కలిసి పని చేసేందుకు ‘యూటా’ సిద్ధంగా ఉందని డేవిడ్ కార్లెబాగ్ అన్నారు. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడి విషయంలో తెలంగాణతో కలిసి చురుగ్గా పని చేస్తామన్నారు. కార్యక్రమంలో యూటా హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ జేసన్ థాంప్సన్, మాట్ మాక్‌ఫెర్సన్, నికోల్ మాక్‌ఫెర్సన్, లైఫ్ టైం ప్రెసిడెంట్ బీజే హాకే, జేకేడీ ప్రెసిడెంట్ మైక్ నెల్సన్, మోనెరె ఏఐ సీఈవో, కో-ఫౌండర్ మౌ నంది, భారత్ వ్యాలీ అడ్వైజర్లు స్టీవ్ వుడ్, సున్‌హాష్ లోడే, ఎక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ ఫౌండర్ లక్ష్మినారాయణ, ఐఐఆర్ఎఫ్ గురు సౌలే తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement