ప్రధాని మోదీ విజన్‌ కొరత వల్లే ఇదంతా.. కేటీఆర్‌ సెటైరిక్‌ విమర్శ

Telangana Minister KTR Shoratage Tweet Slams BJP Govt - Sakshi

హైదరాబాద్‌: కేంద్రంలోని బీజేపీపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ పాలన వల్ల కొరత కొనసాగుతోందంటూ సోమవారం ఉదయం కేటీఆర్‌ ఓ ట్వీట్‌ వేశారు. 

బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు  కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత, ఈ అన్ని సమస్యలకు మూలం ప్రధాని మోడీకి విజన్ కొరత అంటూ ఓ ట్వీట్‌ చేశారు కేటీఆర్‌. అంతేకాదు ఈ పాలన అద్భుతమంటూ వెటకారం ప్రదర్శించారు.

ప్రధాని మోదీకి విజన్‌ లేకపోవడం వల్లే దేశానికి ఈ పరిస్థితి దాపురించిందన్న అర్థంతో కేటీఆర్‌ ఈ ట్వీట్‌ చేశారు. ఇక వీలు చిక్కినప్పుడల్లా బీజేపీపై విరుచుకుపడుతున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. సమకాలీన అంశాలను.. అది టైమింగ్‌లో అస్త్రాలుగా చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తుండడం విశేషం.

చదవండి: చెప్పేది గాంధీ సూక్తులు.. కొలిచేది గాడ్సేను

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top