మేం ఇంత చేశాం.. మరీ మోదీ సర్కార్ ఏం చేసిందో?: కేటీఆర్‌

Telangana Minister KTR Asks PM Modi Govt Over Employment Statistics - Sakshi

హైదరాబాద్‌: రాబోయే 18 నెలల్లో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మోదీ సర్కార్‌ ప్రకటనపై సానుకూలంగా స్పందించినట్లే స్పందించి.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సెటైర్లు వేశారు.  ఈ మేరకు వరుసగా ట్విటర్‌లో ట్వీట్లు చేశారాయన.

తెలంగాణలో ప్రైవేట్ రంగంలో 16 లక్షల ఉద్యోగాలు కల్పించాం. ఈ ఎనిమిదేళ్లలో పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో, దేశంలోని యువతకు తాము వాగ్దానం చేసిన 16 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు లభిస్తాయో ప్రధాని మోదీ తెలియజేయాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

తెలంగాణ.. సాపేక్షంగా చిన్న రాష్ట్రం. గత ఎనిమిదేళ్లలో 1,35,000 ఉద్యోగాలను భర్తీ చేశాం. మరో 1 లక్ష ఉద్యోగాల నియామకం మొదలైంది. అదే నిష్పత్తిలో.. 2014 నుండి 140 కోట్ల భారత జనాభా కోసం మోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలను సృష్టించింది?

నిరుద్యోగ సమస్య మీద ప్రతిపక్ష పార్టీలు, దేశంలోని నిరుద్యోగ యువత తెస్తున్న భారీ ఒత్తిడికి ధన్యవాదాలు. ప్రధాని మోదీ రాబోయే 18 నెలల్లో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. అది స్వాగతించాల్సిన నిర్ణయమే! అదే సమయంలో, అనేక హామీలు నెరవేర్చని కారణంగా ఆయన్ని నమ్మడం కష్టం అని కేటీఆర్‌ వరుస ట్వీట్లు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top