లక్ష మందితో సభ అన్నారు ఏమైంది..?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సభలో పస లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ తప్పతాగి ఫాంహౌస్‌లో పడుకున్నారని.. అందుకే ఢిల్లీ నుంచి తమ నాయకులు వస్తున్నారని పేర్కొన్నారు. డబ్బులు పంచి కేసీఆర్ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. లక్ష మందితో సభ అన్నారు ఏమైందని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. ‘‘మూసి ప్రక్షాళన కాదు కేసీఆర్ నోరు ప్రక్షాళన చేయాలి. మాది గల్లీ నుంచి ఢిల్లీకి విస్తరించిన పార్టీ’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. (చదవండి: ‘ఇంట్లో చెప్పే వచ్చా.. చావుకు భయపడేది లేదు’)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి