కేసీఆర్‌ ఫైటర్‌ కాదు, చీటర్‌: లక్ష్మణ్‌ 

Telangana: BJP OBC Morcha President Laxman Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అవినీతి గురించి సీఎం కేసీఆర్‌ మాట్లాడడం ‘దయ్యాలు వే దాలు వల్లించినట్లు’ ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. సోమవారం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ ఫైటర్‌ కాదు, చీటర్‌ అని, ఆయనకు మంచితనం, మానవత్వం రెండూ లేవని ధ్వజమెత్తారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇస్తే, కేసీఆర్‌ ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నిక ల్లో గెలుపు ఓటములు సహజమని, దానికే ఎమ్మెల్యేగా లక్ష్మణ్‌ ఓడారంటూ సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం ద్వారా కేసీఆర్‌ ఎంత నిరా శ, నిస్పృహల్లో ఉన్నారో స్పష్టమవుతోందన్నా రు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ముషీరాబాద్‌ ని యోజకవర్గంలో కేసీఆర్‌ బొమ్మ పెట్టి ప్రచారం చేస్తే టీఆర్‌ఎస్‌కు ఒక కార్పొరేటర్‌ స్థానమూ రాలేదన్న విషయాన్ని మరవొద్దన్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top