AP: భారీగా మద్యం స్వాధీనం.. టీడీపీ నేతలు అరెస్ట్‌ | TDP Leaders Arrest Over Liquor Distribution In AP | Sakshi
Sakshi News home page

AP: భారీగా మద్యం స్వాధీనం.. టీడీపీ నేతలు అరెస్ట్‌

May 9 2024 9:32 AM | Updated on May 9 2024 2:08 PM

TDP Leaders Arrest Over Liquor Distribution In AP

సాక్షి, ఎన్టీఆర్‌: ఏపీ ఎన్నికల వేళ టీడీపీ పార్టీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, భారీగా మద్యం పంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల నుంచి సెబ్‌ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.

వివరాల ప్రకారం.. ఎన్టీఆర్‌ జిల్లాలో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు సెబ్‌ అధికారులు. తిరువూరు జిల్లాలో 21 సంచుల్లో 4200 మద్యం బాటిల్స్‌ను పట్టుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ నేతలు తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం దిగుమతి చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మోదుగు వెంకటేశ్వరరావు, షేక్‌ షాహిన్‌ పాషా, జీనుగు అశోక్‌ను అరెస్ట్‌ చేశారు. 
 

AP: భారీగా మద్యం స్వాధీనం.. టీడీపీ నేతలు అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement