నోటీసులిచ్చాకే చంద్రబాబు అరెస్టు | Taneti Vanita comments on Chandrababu | Sakshi
Sakshi News home page

నోటీసులిచ్చాకే చంద్రబాబు అరెస్టు

Sep 10 2023 5:20 AM | Updated on Sep 10 2023 5:20 AM

Taneti Vanita comments on Chandrababu - Sakshi

కొవ్వూరు: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాతే అరెస్టు చేశారని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. అంతా చట్టప్రకారమే జరిగిందని.. ఈ విషయంలో విపక్షాలు అన­వసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. శని­వారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కుంభకోణాన్ని గత ప్రభుత్వ హయాంలోనే గుర్తించారని పేర్కొన్నారు.

అవినీతి చేయడం వల్లే.. చంద్రబాబు ఇటీవల అరెస్ట్‌ పేరుతో సానుభూతి డ్రామా మొదలుపెట్టా­రని చెప్పారు. ఆయన అరెస్టును బీజేపీ నేత పురందేశ్వరి ఖండించడం హాస్యా­స్ప­దమన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై రాళ్లు వేయించి, ప్రధాని మోదీని తిట్టిన వ్యక్తులను సమర్థిస్తున్నారా? అని పురందేశ్వరిని ప్రశ్నించారు. ఆమె బీజేపీకి నిబద్ధత­గా ఉంటున్నారో? లేదంటే తన మరిది చంద్రబాబుతో కలిసిపోయారో చెప్పాలని హోం మంత్రి తానేటి వనిత డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు కేసులో ఈడీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు తప్పు చేశాయని బీజేపీ నేతగా పురందేశ్వరి చెప్పాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఈ స్కామ్‌పై ఇన్నాళ్లూ నోరు మెద­పని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌.. ఈరోజు చంద్రబాబుకు అండగా ముందు­కు రావడాన్ని వనిత తప్పుబట్టారు. ఈ కుంభకోణంలో మీకు అందుతున్న ప్యాకేజీ ఎంతని పవన్‌ను ప్రశ్నించారు. సమావేశంలో పశ్చిమ గోదావరి జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ పోసిన శ్రీలేఖ, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్లు మన్నె పద్మ, గండ్రోతు అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement