కేసీఆర్‌ సర్కార్‌పై గవర్నర్‌ తమిళిసై షాకింగ్‌ కామెంట్స్‌.. 

Tamilisai Soundararajan Serious Comments On KCR Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. గవర్నర్‌ తమిళిసై ఇప్పటికే పలు సందర్భాల్లో కేసీఆర్‌ సర్కార్‌పై బహిరంగంగానే విమర్శలు చేశారు. 

కాగా, తమిళిసై మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణలో వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో నేను పర్యటించగానే.. సీఎం కేసీఆర్‌ వరద ఎఫెక్ట్‌ ఉన్న ప్రాంతాలకు తరలివెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎంను రప్పించిన చరిత్ర నాది. ఏనాడు నేను అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. రాజ్‌భవన్‌లో తనకయ్యే ఖర్చును మొత్తం తానే భరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతినెలా తనకయ్యే ఖర్చును తానే సొంతంగా చెల్లిస్తున్నానని, ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకోవడం లేదని స్పష్టం చేశారు. 

గణతంత్ర దినోత్సవం రోజున తనని జెండా ఆవిష్కరించనివ్వలేదని, ప్రసంగం కూడా చేయనివ్వలేదని గవర్నర్ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ తన పని తాను చేసుకుంటూ పోతున్నానని అన్నారు. గవర్నర్‌గా తనకి అధికారం ఉన్నా ప్రత్యేక విమానాన్ని తన ప్రయాణానికి ఉపయోగించలేదని తెలిపారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top