నాగర్‌కోవిల్‌లో ముగ్గురు గాంధీలు..

Tamil Nadu Assembly Polls 2021 3 Gandhi Contestant In Nagercoil - Sakshi

ప్రచార ముమ్మరం

గెలుపే ధ్యేయంగా బీజేపీ అడుగులు 

త్వరలో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రుల ప్రచారం

రేపటి నుంచి విజయకాంత్‌ పర్యటన

సాక్షి ప్రతినిధి, చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో ఎలాగైనా కాలుమోపాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో ప్రజా బలం, ఓటర్ల బలగాన్ని పెంచుకునే పనిలో పడింది. గెలుపు గుర్రం ఎక్కేందుకు ఏ చిన్న అవకాశాన్ని చేజార్చుకోకూడదని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రధాని మోదీ సహా అగ్రనేతలు తమిళనాడుకు తరలివస్తున్నారు. బీజేపీ–అన్నాడీఎంకే కూటమి అభ్యర్థుల గెలుపుకోసం ఈనెల 26న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రచారం చేయనున్నారు.

ఇప్పటికే ఒక విడత ప్రచారం ముగించిన ప్రధాని మోదీ రెండో విడతలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌ మురుగన్‌ పోటీచేస్తున్న తిరుప్పూరు జిల్లా తారాపురంలో 30వ తేదీన ప్రసంగించనున్నారు.  ప్రధాని వచ్చి వెళ్లిన తరువాత కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలాసీతారామన్‌ ప్రచారం చేయనున్నారు. మూడో విడతగా ఏప్రిల్‌ 2న కన్యాకుమారి, మదురైలలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయనుండగా సీఎం ఎడపాడి కూడా పాల్గొంటున్నారు.  

అన్బుమణి రాందాస్‌కు పీటీ వారెంట్‌ 
ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారనే ఆరోపణలపై పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు అన్బుమణి రాందాస్‌కు విల్లుపురం న్యాయస్థానం పీటీ వారెంట్‌ జారీకి ఆదేశించింది. విల్లుపురం జిల్లా బ్రహ్మదేశం పోలీస్‌స్టేషన్‌ సమీపంలో 2013లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్బుమణి హింసను ప్రేరేపించే విధంగా ప్రసంగించారనే అభియోగంపై అప్పటి సీఐ సుధాకర్‌ కేసు నమోదు చేశారు. ఆనాటి నుంచి ఈ కేసు కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈనెల 22న మరోసారి విచారణకు రాగా న్యాయమూర్తి పీటీ వారెంట్‌ జారీ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. 

నాగర్‌కోవిల్‌లో ముగ్గురు గాందీలు.. 
నాగర్‌కోవిల్‌ నియోజకవర్గంలో ముగ్గురు గాందీలు పోటీ చేయడం విశేషంగా మారింది. బీజేపీ అభ్యర్థి ఎంఆర్‌ గాందీపై స్వతంత్ర అభ్యర్థులుగా ఎల్‌ గాంధీ, గాంధీ కనకరాజ్‌ పోటీకి దిగారు. 

రేపటి నుంచి విజయకాంత్‌ ప్రచారం.. 
డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్‌ ఈనెల 25నుంచి ప్రచాచం చేయనున్నారు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం కూటమిలో ఉన్న డీఎండీకే పలువురు అభ్యర్థులను పోటీకి దించింది. అనారోగ్యకారణాలతో పోటీ చేయని విజయకాంత్‌ కూటమి అభ్యర్థులకు మద్దతుగా తిరుత్తణి నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.  

12 గంటల పోలింగ్‌: ఈసీ 
ఏప్రిల్‌ 6న ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యబ్రత సాహూ తెలిపారు. జనవరి 20న విడుదల చేసిన జాబితా ప్రకారం రాష్ట్రంలో 6 కోట్ల 26 లక్షలా74 వేలా 446 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఆ తరువాత వచ్చిన వినతులను పరిశీలించి చేర్పులతో ఓటర్ల సంఖ్య 6 కోట్ల 29 లక్షలా 43 వేలా 512 మందికి పెరిగింది. అంటే గత రెండు నెలల్లో 2,69,66 మంది కొత్తగా ఓటర్ల జాబితాలో చేరారు. ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో పోలింగ్‌ వేళలను ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్ణయించామన్నారు. ఎన్నికల బందోబస్తు నిమిత్తం 235 పారామిలటరీ దళాలు వస్తున్నాయి.  

బీజేపీ అభ్యరి్థపై చార్జిషీటు.. 
2019 నాటి ఉప ఎన్నికల్లో ప్రమాణ పత్రంలో ఆస్తికి సంబంధించి వాస్తవాలను దాచిపెట్టిన అభియోగంపై పుదుచ్చేరి కామరాజర్‌ నియోజకవర్గ అభ్యర్థి జాన్‌కుమార్‌పై చార్జిïÙటు దాఖలైంది. పుదువై పోరాళిగల్‌ సంఘం ప్రధాన కార్యదర్శి సెల్వముత్తురామన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి ఈ మేరకు పోలీసులకు ఆదేశాలిచ్చారు.
చదవండి: Tamil Nadu Assembly Election 2021: అధికారం ఎవరిదో?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top