మా జాబితా తప్పని నిరూపించగలవా!  | Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

మా జాబితా తప్పని నిరూపించగలవా! 

Feb 20 2021 9:23 AM | Updated on Feb 20 2021 9:23 AM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

‘మావాళ్ల వివరాలను వెల్లడించడంలో మేమింత పారదర్శకంగా ఉంటే.. టీడీపీ గెలిచిన వారి వివరాలు ఎందుకు చెప్పడం లేదో అర్థం కావడం లేదు’

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్‌సీపీ అభిమానుల వివరాలన్నీ వెబ్‌సైట్‌లో ఉంచామని,  దమ్ము ధైర్యం ఉంటే ఇందులో ఏ ఒక్కటైనా తప్పుందని నిరూపించగలరా అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్‌ విసిరారు. చంద్రబాబు ఓటమిని హుందాగా ఒప్పుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఏజెన్సీలో మొత్తం పంచాయతీలు తామే కైవసం చేసుకున్నామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్‌లో శుక్రవారం ఘాటుగా స్పందించారు. ప్రజలు చీత్కరించినా ఇంకా ఎవరిని మభ్యపెడతారని ఆయన ప్రశి్నంచారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు వచ్చిన మెజారిటీతో పోలిస్తే టీడీపీ ఎక్కడా కనీస స్థాయిలో పోటీ పడలేదని పేర్కొన్నారు.

‘మావాళ్ల వివరాలను వెల్లడించడంలో మేమింత పారదర్శకంగా ఉంటే.. టీడీపీ గెలిచిన వారి వివరాలు ఎందుకు చెప్పడం లేదో అర్థం కావడం లేదు’ అన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రజా సంక్షేమానికి ప్రజలు పెద్దఎత్తున తీర్పు ఇస్తే.. దీన్ని అపహాస్యం చేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు. తిమ్మిని బమ్మిని చేస్తే ప్రజలు నమ్ముతారనే భ్రమ నుంచి చంద్రబాబు ఇంకా బయటపడలేదని ఎద్దేవా చేశారు. దశాబ్దాలుగా గెలిపించిన కుప్పం ప్రజలే డబ్బుల మాయలోఓట్లేశారని అవమానించిన చంద్రబాబును ప్రజలు ఎందుకు క్షమించాలని ప్రశ్నించారు. పిల్లనిచి్చన మామను, ఓట్లేసిన ప్రజలను వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు న్యాయమేనా అన్నారు. ఆయనకున్న సంస్కారం ఇదేనన్నారు.
చదవండి: విశాఖ ఘటనలో ఏపీ సర్కార్‌ పనితీరు భేష్‌    
సొల్లు కబుర్లతో శునకానందం: కొడాలి నాని

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement