టీడీపీ దిక్కుమాలిన పార్టీ: రాయపాటి రంగారావు | Rayapati Ranga Rao Fires On Chandrababu Naidu And Nara Lokesh Over Their Frauds - Sakshi
Sakshi News home page

టీడీపీ దిక్కుమాలిన పార్టీ: రాయపాటి రంగారావు

Jan 12 2024 7:11 PM | Updated on Feb 4 2024 1:35 PM

Rayapati Ranga Rao Fires On Chandrababu And Lokesh - Sakshi

టీడీపీ దిక్కుమాలిన పార్టీ అంటూ మండిపడ్డారు.. ఆ పార్టీకి రాజీనామా చేసిన రాయపాటి రంగారావు. టీడీపీ అసలు రాజకీయ పార్టీయే కాదని.. ఒక  వ్యాపార సంస్థగా ఆయన అభివర్ణించారు.

సాక్షి, గుంటూరు: టీడీపీ దిక్కుమాలిన పార్టీ అంటూ మండిపడ్డారు.. ఆ పార్టీకి రాజీనామా చేసిన రాయపాటి రంగారావు. టీడీపీ అసలు రాజకీయ పార్టీయే కాదని.. ఒక  వ్యాపార సంస్థగా ఆయన అభివర్ణించారు.

మా కుటుంబాన్ని సర్వ నాశనం చేసింది టీడీపీ.. గత ఎన్నికల్లో 150 కోట్లు మా నుంచి తీసుకున్నారు. లోకేష్, చంద్రబాబు మా దగ్గర ఎంత తీసుకున్నారో  లెక్కంతా ఉంది. మంగళగిరిలో లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తా. లోకేష్‌ను మంగళగిరిలో ఓడిస్తానంటూ రంగారావు సవాల్ విసిరారు.

కియా కంపెనీ తానే తెచ్చారని చెప్పుకునే చంద్రబాబు.. మరి రాయలసీమలో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను చంద్రబాబు, లోకేష్ ఎక్కడ పనిచేయనివ్వలేదు. కన్నా లక్ష్మీనారాయణ ఒక్క కులానికి పని చేస్తాడని, తాము అన్ని కులాలకు పని చేస్తామని రాయపాటి రంగారావు అన్నారు.

ఎన్నికల వేళ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్‌ నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. విజయవాడ, గుంటూరులలో కేశినేని, రాయపాటి కుటుంబాలు టీడీపీకి అండగా నిలుస్తూ వచ్చాయి. చంద్రబాబు విధానాలు నచ్చక ఆ నేతలు సైకిల్ దిగారు.

మొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పగా, నేడు రాయపాటి రంగారావు రాంరాం చెప్పారు. మరో నేత లింగమనేని శివరామ ప్రసాద్‌ కూడా రాజీనామా చేశారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అందులో ఉన్న లింగమనేని.. ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా ప్రకటించారు. అదే బాటలో మరికొందరు సీనియర్ నేతలు నడవనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: టీడీపీలో కొత్త ట్విస్ట్‌.. కుప్పంలో చంద్రబాబుకు ఎదురుగాలి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement