Pramod Sawant Takes Oath As Goa CM For Second Consecutive Term - Sakshi
Sakshi News home page

గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణం

Mar 28 2022 11:22 AM | Updated on Mar 28 2022 12:51 PM

Pramod Sawant Takes Oath As Goa CM For Second Term - Sakshi

పనాజి: గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాలు హాజరయ్యారు. గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ బాధ్యతలు స్వీకరించడం ఇది రెండోసారి.

కాగా, ఇటీవల గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లను గెలుచుకుంది. 40 సీట్లున్న గోవాలో బీజేపీ 20 సీట్లు సాధించగా, మహరాష్ట్రవాదీ గోమాన్‌తక్‌ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గరు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్దతుగా నిలిచారు. 

Advertisement
 
Advertisement
Advertisement