
ఆంధ్రప్రదేశ్‌లో ఓటు బ్యాంకు లేని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంట బీజేపీ ఎం దుకు పడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ప్రశ్నించానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఓటు బ్యాంకు లేని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంట బీజేపీ ఎం దుకు పడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ప్రశ్నించానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో పాల్ మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణే తమ వెంట పడుతున్నారని అమిత్‌షా చెప్పారన్నారు. ఏపీలో బీజేపీ, జనసేనకు ఎలాంటి ఓ టు బ్యాంకు లేదని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, అప్పుల గురించి అమిత్‌షాతో చర్చించానన్నారు.
చదవండి: కేంద్రమంత్రులకు సీఎం జగన్ లేఖలు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ మినహా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భా రతం, ఈశాన్య రాష్ట్రాల్లో 175 ఎంపీ సీట్లలో పోటీ చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భూస్థాపితం అయిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా అవతరించనున్నామని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన కుమారుడు కోసమే పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా చేసిన రూ.6 లక్షల కోట్ల అప్పుల గురించి చంద్రబాబు చెప్పడం లేదన్నారు. దేశంలో కుటుంబ పార్టీలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు.