టీడీపీ ఉడత ఊపులకు భయపడం: ఎమ్మెల్యే పిన్నెల్లి | Pinnelli Ramakrishna Reddy Visited Injured YSRCP Activists In Macherla Issue | Sakshi
Sakshi News home page

టీడీపీ ఉడత ఊపులకు భయపడం: ఎమ్మెల్యే పిన్నెల్లి

Dec 18 2022 4:39 PM | Updated on Dec 18 2022 4:42 PM

Pinnelli Ramakrishna Reddy Visited Injured YSRCP Activists In Macherla Issue - Sakshi

టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో వార్డు మహిళలు నిలదీశారనే అక్కసుతోనే మాపై దాడి చేసి చంపాలని చూశారని ఎమ్మెల్యే మండిపడ్డారు.

సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో వార్డు మహిళలు నిలదీశారనే అక్కసుతోనే మాపై దాడి చేసి చంపాలని చూశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. నెలవారీ ముమూళ్లు ఇచ్చి బ్రహ్మారెడ్డిని ఇంఛార్జిగా పెట్టారని దుయ్యబట్టారు.

టీడీపీ అధికారంలోకి రాదని తెలిసే మాపై దాడులు చేస్తున్నారన్నారు. ‘‘యరపతినేని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే పిన్నెల్లి హెచ్చరించారు. ‘‘ఇక్కడ ఉడత ఊపులకు భయపడేవారు ఎవరూలేరు. టీడీపీ నాయకులు దమ్ముంటే డైరెక్ట్‌గా రండి.. ఏ డిబేట్‌కైన సిద్ధం’’ అంటూ రామకృష్ణారెడ్డి సవాల్‌ విసిరారు.
చదవండి: మాచర్ల స్కెచ్‌ చంద్రబాబుదే... 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement