
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత సిద్ధూ.. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో తొలిసారి భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య సుదీర్ఘ సమావేశం జరగ్గా, సిద్ధూ డిమాండ్లను సీఎం చన్నీ అంగీకరించినట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం నవజ్యోత్ సింగ్ సిద్ధూ మట్లాడుతూ.. పార్టీ, ప్రభుత్వం కలిసిమెలిసి పనిచేయాలని అన్నారు. నిజాయతీ, నమ్మదగిన అధికారులను నియమించాలని అన్నారు.
మంగళవారం పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు సిద్ధూ. తన రాజీనామా లేఖలో పరోక్షంగా అమరీందర్ సింగ్‌ను వ్యవహరాన్ని ప్రస్తావించారు.
చదవండి: Punjab Crisis: బీజేపీలో చేరికపై అమరీందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు