కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. చివరి నిమిషంలో ట్విస్ట్‌.. బీజేపీ విన్‌

Nagaland Congress Khekashe Sumi Withdraw His MLA Nomination - Sakshi

కోహిమా: భారత ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. కాగా, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మార్చి 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నాగాలాండ్‌ అసెంబ్లీలో 60 స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నది.

అయితే, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాగాలాండ్‌లో అధికారం చేజిక్కించుకోవాలనుంటున్న కాంగ్రెస్‌ పార్టీకి హస్తం పార్టీ నేత షాకిచ్చారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అకులుటో స్థానం నుంచి బరిలోకిదిగిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఖేకషే సుమీ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శుక్రవారం.. ఆఖరి క్షణాల్లో తాను పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం, తన నామినేషన్‌ను విత్‌ డ్రా చేసుకున్నారు. దీంతో, కాంగ్రెస్‌ బిగ్‌ షాక్‌ తగలింది. 

ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ నేత నామినేషన్‌ ఉపస​ంహరణ బీజేపీకి కలిసివచ్చింది. ఖేకషే సుమీ నామినేషన్‌ విత్‌ డ్రా కావడంతో ఆ స్థానంలో ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి కఝెటో కినిమీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో ఉన్న ఇద్దరిలో ఒకరు తప్పుకోవడంతో 68 ఏండ్ల కినిమీ యునానిమస్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కినిమీ ఎమ్మెల్యేగా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top