చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy Made Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రోజున ట్విటర్‌ వేదికగా చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్‌లో డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టే నీచ సంస్కృతిని గిన్నిస్‌ బుక్‌ రికార్డులకు తీసుకెళ్లిన ఘనత ప్రతిపక్షనేత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నంద్యాల బై ఎలక్షన్‌లో  ఓటర్లకు  డబ్బును పంచడం పరాకాష్టకు చేరిందని తెలిపారు.

తిరుపతిలో జరిగిన ఉపఎన్నికలో కేవలం అభివృద్ధిని మాత్రమే చూసి ఓటు​ వేయండని అడిగిన ఘనత  సీఎం జగన్‌కే చెల్లుతుందని అన్నారు. డబ్బు ప్రబావం లేని ఎన్నికలకు సీఎం జగన్‌ నాంది పలికారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. కాగా, తిరుపతి ఉపఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 17న జరిగిన సంగతి తెలిసిందే. ఉపఎన్నిక ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. 
 

చదవండి: టీడీపీలో సస్పెన్షన్ల కలకలం..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top