
సాక్షి, తాడేపల్లి: ఏపీలో టీడీపీ, బీజేపీ పార్టీలకు చురకలంటించారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బీజేపీ పురంధేశ్వరి కావాలనే సోము వీర్రాజును పక్కనబెట్టారు. అలాగే, ఎల్లో మీడియా పెద్దలు ఓటమి భయంతో రాత్రి పూట నిద్రపోవడంలేదని ఎద్దేవా చేశారు.
కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ఏమాటకామాట! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి కావాలని ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు మాటకు కనీస విలువ ఇవ్వడం లేదంట. ఆయన హయాంలో రాజమండ్రిలో నిర్మించిన పార్టీ ఆఫీసును వదిలేసి ఆమె సొంత ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం, సొంత మనుషుల ద్వారా ప్రచారం నిర్వహించడం మొదటి నుంచి పార్టీలో ఉన్న కేడర్‌ను నమ్మకుండా అవమానించడమేనని అంటున్నారు.
ఏమాటకామాట! బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు గారు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి గారు కావాలని ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు గారి మాటకు కనీస విలువ ఇవ్వడం లేదంట. ఆయన హయాంలో రాజమండ్రిలో నిర్మించిన పార్టీ ఆఫీసును…
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 6, 2024
ఎన్నికలలో టీడీపీ (తప్పుడు)ప్రచారం రెండు రకాలుగా సాగుతోంది. ఒకటో రెండో రోడ్డు షోలు, సభలతో అలిసిపోయి విశ్రాంతి వాహనంలోకి వెళ్లిపోతున్నాడు చంద్రబాబు. అక్కడ హైదరాబాద్ నుంచి పత్రికలు, టీవీ చానళ్ళ ద్వారా ఆయనకు కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా పెద్దలకు మాత్రం రాత్రి పూట నిద్ర పట్టడం లేదంట. ఈ ఆఖరి పోరాటంలో బాబుకు ఓటమి తప్పదనే ‘కమురు వాసన’ అక్కడివరకు వ్యాపించడం వారిని కలవరపాటుకి గురిచేస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు.
ఎన్నికలలో టీడీపీ (దుష్)ప్రచారం రెండు రకాలుగా సాగుతోంది. ఒకటో రెండో రోడ్డు షోలు, సభలతో అలిసిపోయి విశ్రాంతి వాహనంలోకి వెళ్లిపోతున్నాడు చంద్రబాబు. అక్కడ హైదరాబాద్ నుంచి పత్రికలు, టీవీ చానళ్ళ ద్వారా ఆయనకు కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా పెద్దలకు మాత్రం రాత్రి పూట నిద్ర పట్టడం లేదంట. ఈ…
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 6, 2024