బండారు.. మీ ఇంట్లో ఆడపడుచులు లేరా?: ఎంపీ నవనీత్‌ కౌర్‌ | Sakshi
Sakshi News home page

బండారు.. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా?: నటి, ఎంపీ నవనీత్‌ కౌర్‌

Published Sat, Oct 7 2023 2:06 PM

MP Navaneet Kaur Rana Slams TDP Bandaru Supports RK Roja  - Sakshi

సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్‌ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై.. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల్ని ముక్తకంఠంతో ఖండిస్తోంది మహిళా లోకం. ఈ క్రమంలో మాజీ నటికి మద్దతుగా పలువురు ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ఎంపీ(అమరావతి నియోజకవర్గం), మాజీ సినీ నటి నవనీత్‌ కౌర్‌ రాణా సైతం రోజా అండగా నిలిచారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బండారుపై ఆమె ఆగ్రహం వెల్లగక్కారు. 

‘‘బండారు.. అసలు సిగ్గు ఉందా?. మంత్రి రోజా పై ఇంత దిగజారి మాట్లాడతావా?. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా?. తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని చాలా గౌరవిస్తారు. కానీ, ఈ బండారు మహిళల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడారు. నీకు రాజకీయాలు ముఖ్యమా?.. లేకుంటే మహిళల గౌరవం ముఖ్యమా?.. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి’’ అని నవనీత్‌ కౌర్‌ ఫైర్‌ అయ్యారు.  

ఒక ఎంపీగా, నటిగా, మహిళగా నేను ఏపీ మంత్రి రోజాకు అండగా ఉంటా. నేనే కాదు.. యావత్ మహిళలంతా రోజాకు అండగా ఉంటుందని నవనీత్‌ కౌర్‌ పేర్కొన్నారు. ‘‘రోజా సినీ పరిశ్రమకు సేవలందించారు. స్టార్‌ హీరోల సరసన నటించారు. ఆమెను ఇంతలా కించపర్చడం సరికాదు. రాజకీయాల్లో ఇంతలా దిగజారి మాట్లాడటమూ మంచిది కాద’’ని నవనీత్‌ కౌర్‌ హితవు పలికారు. ఇప్పటికే సీనియర్‌ నటులు కుష్బూ సుందర్‌, రాధికా శరత్‌కుమార్‌ రోజాకు మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు నవనీత్‌ కౌర్‌ రాణా సైతం మద్దతుగా నిలిచారు.

Advertisement
 
Advertisement
 
Advertisement