మార్నింగ్‌ టాప్‌ 10 తెలుగు న్యూస్‌ | Sakshi
Sakshi News home page

Morning 10 AM Top News: మార్నింగ్‌ టాప్‌ 10 తెలుగు న్యూస్‌

Published Mon, Jul 11 2022 10:00 AM

Morning Top 10 News Telugu Breaking News Latest Updates 11th July 2022 - Sakshi

1. కఠిన ఆంక్షలు అమలు చేసినా కట్టడి కాని కరోనా.. చైనాలో కొత్త వేరియంట్ కలకలం
కరోనాను కట్టడి చేసేందుకు 'జీరో పాలసీ' పేరుతో లాక్‌డౌన్ సహా అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. అయినప్పటికీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటం డ్రాగన్‌ కంట్రీకి తలనొప్పులు తెస్తోంది. తాజాగా షాంఘై నగరంలోని పుడాంగ్ జిల్లాలో కరోనా ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ B.A.5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌
అన్నాడీఎంకే అంతర్గత కలహాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పన్నీరు సెల్వం పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంపై నిషేధం లేదని తేల్చి చెప్పింది.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. శ్రీలంకలో జరిగిందే ఇక్కడా రిపీట్ అవుతుంది.. మోదీ కూడా గొటబాయలా..
తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పట్టిన గతే మోదీకీ పడుతుందని అన్నారు. ఆయనలాగే మోదీ కూడా రాజీనామా చేసి పారిపోతారని పేర్కొన్నారు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. విశాఖకు సీఎం జగన్‌.. టూర్‌ షెడ్యూల్‌ ఇదే..|
ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 13న ఉదయం 10.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి విచ్చేస్తారు. 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌కు వెళ్తారు. 
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. Pawan Kalyan: జనవాణా.. విషవాణా?
‘జనవాణి’ పేరిట జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విషవాణి వినిపిస్తున్నారు. అవాస్తవాలు, కట్టుకథలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన అనిత అనే మహిళతో ఆయన హైడ్రామా సృష్టించారు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. IND vs ENG 3rd T20: సూర్య 'ప్రతాపం' సరిపోలేదు.. సిరీస్‌ మాత్రం టీమిండియాదే
ఆఖరి పోరులో ఇంగ్లండ్‌ చెమటోడ్చి పరువు నిలబెట్టుకుంది. మూడో టి20లో సూర్య కుమార్‌ యాదవ్‌ (55 బంతుల్లో 117; 14 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులకు సరైన సహకారం లేక భారత్‌ 17 పరుగులతో ఓడింది. సిరీస్‌ను 2–1తో సరిపెట్టుకుంది. 
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Dil Raju-Nithin: ఇండస్ట్రీలో 20 ఏళ్లు.. ఇది మామూలు విషయం కాదు
‘‘జయం’(2002) సినిమాతో మొదలైన నితిన్‌ ప్రయాణం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఇంత పోటీలో కూడా నితిన్‌ సక్సెస్‌ ఫుల్‌గా ఉండటం గొప్ప విషయం. 
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఎస్సై లీలలు.. పెళ్లి చేసుకుంటానని పదేళ్లుగా సహజీవనం, మరొక మహిళతో..
కణతపై తుపాకీ గురిపెట్టి వివాహితను ఓ పోలీసు అధికారి అత్యాచారం చేసిన ఘటన ఇంకా మరువక మునుపే పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లపాటు సహజీవనం చేసి మోసం చేసిన మరో పోలీసు అధికారి అరాచకం వెలుగులోకి వచ్చింది. 
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. DMart: డీమార్ట్‌ ఆకర్షణీయ ఫలితాలు.. మరింత పెరిగిన లాభాలు
డీమార్ట్‌ స్టోర్ల నిర్వాహక దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం పలు రెట్లు ఎగసి రూ. 643 కోట్లకు చేరింది.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. గురువాణి–1: నిన్ను వెలిగించే దీపం... నవ్వు
‘‘నవ్వవు జంతువుల్,  నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్‌/ దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్,/పువ్వులవోలె ప్రేమరసమున్‌ వెలిగ్రక్కు/ విశుద్ధమైన లే/నవ్వులు– సర్వదుఃఖ శమనంబులు, వ్యాథులకున్‌ మహౌషథుల్‌’’ మహాకవి గుర్రం జాషువా గారి పద్యం ఇది.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

తప్పక చదవండి

Advertisement