Mood of the Nation: ఎన్డీఏ కూటమికి నితీశ్‌ దెబ్బ!

Mood of the Nation Poll: Nitish Kumar Walkout Could Reduce NDA Lok Sabha Seat Share - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ దెబ్బకొట్టేలా కన్పిస్తున్నారు. ఎన్డీఏ సంకీర్ణం నుంచి నితీశ్‌ కుమార్‌ బయటకు వెళ్లిపోవడం దెబ్బేనని ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు (ఆగస్టు 1) లోక్‌సభ ఎ‍న్నికలు జరిగితే ఎన్డీఏ 307 సీట్లు సాధిస్తుందని పోల్‌ ఆధారంగా వెల్లడైంది. అయితే బీజేపీతో నితీశ్‌ తెగతెంపులు చేసుకోవడంతో ఎన్డీఏ సాధించే సీట్ల సంఖ్య తగ్గుతుందని పేర్కొంది. 

2024 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉంది. ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌ చెక్కు చెదరలేదని పోల్‌లో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ ఆయనే ప్రధానమంత్రి అవుతారని తేల్చింది. ఎన్డీఏకు 307, యూపీఏకు 125 సీట్లు వచ్చే అవకాశముంది. ఇతరులు 111 స్థానాలు దక్కించుకుంటారని అంచనా.

సీ-ఓటర్‌తో కలిసి ఆగస్టు 1 వరకు ఇండియా టుడే ఈ పోల్‌ నిర్వహించింది. అయితే ఇప్పుడు నితీశ్‌ కుమార్‌ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు కాబట్టి ప్రత్యక్షంగా 21 సీట్లు తగ్గుతాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిహార్‌లో ప్రత్యర్థులను ఎదుర్కొని బీజేపీ ఏమేరకు ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి. (క్లిక్: ప్లీజ్‌ వదిలేయండి.. ఆ విషయం మళ్లీ అడగకండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top