Nitish Kumar Said Prime Ministerial Ambitions Are Not My Mind - Sakshi
Sakshi News home page

Nitish Kumar: ప్లీజ్‌ వదిలేయండి.. ఆ విషయం మళ్లీ అడగకండి: సీఎం నితీష్‌ రిక్వెస్ట్‌

Aug 12 2022 6:33 PM | Updated on Aug 12 2022 6:44 PM

Nitish Kumar Said Prime Ministerial Ambitions Are Not My Mind - Sakshi

Chief Minister Nitish Kumar Comments.. ఎవరూ ఊహించని విధంగా బీహార్‌లో పాలిటిక్స్‌ ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీతో తెగదెంపులు చేసుకుని నితీష్‌ కుమార్‌.. కాంగ్రెస్‌, ఆర్జేడీ సపోర్టుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నితీష్‌కు సంబంధించిన ఓ వార్త పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌ మారింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో(2024) నితీష్‌.. ప్రతిపక్ష పార్టీల కూటమికి అభ్యర్థిగా ప్రధాని రేసులో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని రేసుపై నితీష్‌ స్పందించారు. 

సీఎం నితీష్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను అందరికీ నమస్కరించి చెబుతున్నాను. నాకు అలాంటి ఆలోచ‌న లేద‌ని అన్నారు. దయచేసి ప్రధాని రేసు విషయాన్ని వదిలేయండి. అంద‌రికోసం ప‌నిచేయ‌డమే త‌న ప‌నని, విప‌క్షాల‌న్నీ క‌లిసిక‌ట్టుగ ప‌నిచేసేలా చూస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

ఈ క్రమంలోనే బీహార్‌లో కేబినెట్‌ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలోని పార్టీలతో కలిసి చర్చించిన అనంతరం.. 15వ తేదీ తర్వాత విస్తరణ జరుగుతుందని చెప్పారు. అలాగే, తేజస్వీ ఇచ్చిన పది లక్షల ఉద్యోగాల హామీపై చర్చిస్తున్నామని స్పష్టం చేశారు. అందుకు మా వంతు కృషి చేస్తున్నాము. 2015-16లో చెప్పినవన్నీ చేశాం. కాబట్టి ఇప్పుడు కూడా ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి బిగ్‌ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement