మండపేట(తూ.గో. జిల్లా): మండపేటలో పేదల ఇళ్లు కూల్చివేతపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. పుష్కరాల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమన్నారు. పొలాలను లే అవుట్‌లుగా మార్చే ఉద్దశంతోనే పేదల ఇళ్లను రాత్రికి రాత్రే తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుపేదల ఇళ్లను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సహకారంతో కూల్చేసిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు.పుష్కరాల పేరుతో పేదలకు నిలువు నీడ లేకుండా చేశారు. మూడు పుష్కరాల నుంచి ఉంటున్న వారిని అక్కడ నుండి తొలగించాల్సిన అవసరం ఏమి వచ్చిందో చెప్పాలి?, అది కూడా 200 మంది పోలీసులతో అర్ధరాత్రి రెండు, మూడు గంటలకు వచ్చి తొలగించాల్సిన అవసరం ఏముంది. అదే పని పట్టపగలు ఎందుకు చేయలేదు.
మండపేటలో నేనేదో అరాచకాలు చేస్తున్నట్లు చెప్పడం సిగ్గుచేటు. అభివృద్ధిని నేను అడ్డుకుంటున్నానని చెప్పడం హాస్యాస్పదం. గతంలోఆస్తులు గురించి సవాల్ విసిరారు. ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను... ఎక్కడైనా చర్చకు సిద్ధం’ అని సవాల్ విసిరారు.
‘కొండపల్లి మున్సిపాలిటీపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలి’


