MLA Jagga Reddy Challenge to Revanth Reddy Over Sangareddy Constituency Winning - Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డి సవాల్‌.. దమ్ముంటే అభ్యర్థిని పెట్టి గెలిపించు..

Mar 20 2022 3:18 PM | Updated on Mar 20 2022 5:34 PM

MLA Jagga Reddy Challenge To Revanth Reddy Over Sangareddy Constituency Winning - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్‌ విసిరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని అన్నారు. అయితే రేవంత్‌రెడ్డికి దమ్ముంటే తనకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని చాలెంజ్‌ చేశారు. తనను సస్పెండ్‌ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. షోకాజ్‌ నోటీసు ఇస్తే.. సమాధానం చేబుతానని అన్నారు.

తనను సస్పెండ్‌ చేస్తే.. రోజుకో బండారం బయటపెడతానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పార్టీ లైన్‌లో పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి పర్సనల్‌ షో చేస్తున్నారని, అందుకే తాను కూడా పర్సనల్‌ షో చేస్తున్నానని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement