సంక్షేమ పాలనను పక్కదోవ పట్టించేందుకే కేసులు: సజ్జల | Misled Politics Happening In AP Said Sajjala RamaKrishna Reddy | Sakshi
Sakshi News home page

సంక్షేమ పాలనను పక్కదోవ పట్టించేందుకే కేసులు: సజ్జల

Sep 15 2021 4:24 PM | Updated on Sep 15 2021 6:04 PM

Misled Politics Happening In AP Said Sajjala RamaKrishna Reddy - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనను పక్కదోవ పట్టించేందుకే రఘురామకృష్ణంరాజు కేసులు వేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇలాంటి దురుద్దేశపూరితమైన కేసులను కోర్టులు కూడా స్వీకరించకూడదని అన్నారు. సుప్రీంకోర్డు కూడా పిల్‌లు దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించిందని గుర్తుచేశారు.
చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? : రేవంత్‌రెడ్డి

ఈ కేసును అడ్డు పెట్టుకుని వాళ్లు చేసిన విషప్రచారం అంతాఇంతా కాదని పేర్కొన్నారు. ఎల్లో మీడియా అసంబద్ధమైన చర్చలు పెట్టిందని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వారి పైత్యం పతాక స్థాయికి చేరింది.. చివరకు న్యాయమే గెలిచింది’ అని ఆయన బుధవారం నాటి మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇలాంటి దుష్ప్రచారాలపై కోర్టులు కూడా దృష్టి సారించాలని సజ్జల విజ్ఞప్తి చేశారు. దురుద్దేశపూరితమైన ప్రచారాలను సూమోటోగా తీసుకోవాలని కోరారు.
చదవండి: నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ వైరల్‌ 

Advertisement
 
Advertisement
Advertisement