‘లోకేష్‌ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడు’ | Minister Gummanur Jayaram Comments On Nara Lokesh | Sakshi
Sakshi News home page

లోకేష్‌. నోరు అదుపులో పెట్టుకో..

Jun 18 2021 3:02 PM | Updated on Jun 18 2021 5:23 PM

Minister Gummanur Jayaram Comments On Nara Lokesh - Sakshi

లోకేష్‌ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడని మంత్రి గుమ్మనూరు జయరాం నిప్పులు చెరిగారు.

సాక్షి, విజయవాడ: లోకేష్‌ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడని మంత్రి గుమ్మనూరు జయరాం నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నోరు అదుపులో పెట్టుకోకపోతే లోకేష్‌ను ప్రజలు తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. ‘‘151 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన మగాడు సీఎం జగన్. మీ నాన్న నిన్ను కూడా గెలిపించుకోలేకపోయాడంటూ’’ మంత్రి ఎద్దేవా చేశారు.

మంగళగిరిలో లోకేష్‌ను పిచ్చికుక్కను కొట్టినట్లు తరిమికొట్టారన్నారు. ‘‘టీడీపీ హయాంలో చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య జరిగింది. టీడీపీ నేతలు మా నేతను హత్య చేశారు.. అప్పుడు లోకేష్ ఏమయ్యాడు’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. ఏం చేసినా కర్నూలులో టీడీపీకి భవిష్యత్‌ ఉండదని మంత్రి జయరాం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదన్నారు. 

చదవండి:
అశోక్‌గజపతిరాజు జైలుకెళ్లడం తప్పదు: విజయసాయిరెడ్డి
లోకేష్‌ వ్యవహార శైలిపై చంద్రబాబు సిగ్గుపడాలి

Advertisement
 
Advertisement
Advertisement