‘జండాలు జతకట్టడమే మీ ఎజెండా! ఉన్నోళ్లు పారిపోడమే వాళ్ల ఎజెండా!’

Minister Ambati Rambabu Satires On Pawan Kalyan - Sakshi

సాక్షి, గుంటూరు: ‘‘పవర్ స్టార్.. పవర్ స్టార్ అని పొగడటమేగాని "పవర్ షేర్" గురించి మాత్రం మాట్లాడరు మోసపోకండి జనసైనికులారా!’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో చురకలు అంటించారు. ‘‘జండాలు జతకట్టడమే మీ ఎజెండా! ఉన్నోళ్లు పారిపోడమే వాళ్ల ఎజెండా!’’ అంటూ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.  పవన్ కల్యాణ్‌కి క్యాష్ ట్రాన్స్ ఫర్ అవుతుంది కానీ... చంద్రబాబుకు మాత్రం ఓటు ట్రాన్స్ ఫర్ కాదంటూ మరో ట్విట్‌లో మంత్రి అంబటి ఎద్దేవా చేశారు.

కాగా, పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు విదిల్చిన 24 సీట్లను తీసుకునేందుకు అంగీకరించిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌పై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. దీంతో జనసేన పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం చల్లారడం లేదు. నాలుగు రోజులుగా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. సోషల్‌ మీడియాలోనూ పవన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందో­ళనలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: బాపట్ల ‘సిద్ధం’.. మార్చి 10న

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top