ఇక్కడ స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈయన మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా (Meghalaya CM Conrad Sangma). మౌడియాంగ్‌డియాంగ్‌లో నిర్మాణమవుతున్న మేఘాలయ శాసనసభ నూతన భవనాన్ని ఆయన తాజాగా పరిశీలించారు. స్పీకర్ థామస్ సంగ్మా, డిప్యూటీ స్పీకర్ తిమోతీ డి షిరా, ఉప ముఖ్యమంత్రి ప్రిస్టోన్ టైన్‌సాంగ్ నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు.
మేఘాలయ శాసనసభ నూతన భవన నిర్మాణం ఆ రాష్ట్ర చరిత్రలో గొప్ప మైలురాయి. నిర్మాణం చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో శాసనసభ భవనం ప్రారంభోత్సవం కోసం మేఘాలయ పౌరులలో నిరీక్షణ పెరిగింది. ఈ మైలురాయి రాష్ట్ర అభివృద్ధి పథంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది.

నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపుతుంటారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అయితే కొందరు సీఎంలు మాత్రం ఏదో ఒక వ్యాపకంతో ప్రత్యేకత చాటుతూ ఉంటారు. అలాంటి వారిలో మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ఒకరు. ఐరన్ మైడెన్ పాటకు ఆయన ఎలక్ట్రిక్ గిటార్‌పై వాయిస్తున్న వీడియో కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సంగీతం తనకు అంతులేని ఉత్సాహాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తుందని సీఎం సంగ్మా చెబుతుంటారు. తాను ఎప్పుడూ సంగీతంలోనే ఉంటానని, అవకాశం దొరికినప్పుడల్లా ఎలక్ట్రిక్ గిటార్ ప్లే చేస్తానని చెప్పారు. క్యాబినెట్ సహచరులతో ఉన్నప్పుడు, ముఖ్యమైన సమావేశాలు, కార్యక్రమాల అనంతరం లైవ్ ప్రదర్శన ఇవ్వడానికి ఇష్టపడుతుంటానని తెలిపారు.


