
సాక్షి, విజయవాడ: మహానాడు కోసం ప్రజల ప్రాణాలతో చంద్రబాబు సర్కార్ చెలగాటమాడుతోంది. టీడీపీ నేతల ఒత్తిడితో కోవిడ్ అడ్వైజరీని వైద్య ఆరోగ్య శాఖ ఉపసంహరించింది. కేసులు నమోదు కానప్పుడు ఈ నెల 21న జాగ్రత్తలు కోసం వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 3 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాక కోవిడ్ అడ్వైజరీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కేవలం మహానాడు కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టేలా నిర్ణయం తీసుకుంది.
బహిరంగ సభలు, భారీ ర్యాలీలు, జన సమీకరణ చేపట్టొద్దని వైద్య ఆరోగ్య శాఖ 21న ఆదేశాలు జారీ చేసింది. 27, 28, 29న జన సమీకరణతో మహానాడు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. మహానాడు కోసం ప్రజల సంరక్షణను పణంగా పెడుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ ఆదేశాలు చూసి వైద్యులు నివ్వెరపోతున్నారు.