ప్రభుత్వ అసమర్థత వల్లే  గ్రూప్‌–1 వాయిదా

Kishan Reddy Comments On CM KCR Ruling Over Group 1 Exam Cancel - Sakshi

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

మద్యం నోటిఫికేషన్‌పై ఉన్న శ్రద్ధ ఉద్యోగ నోటిఫికేషన్లపై లేదు: డీకే అరుణ

కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది : ఈటల 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గ్రూప్‌–1 పరీక్షలు మళ్లీ వాయిదా పడటంపై బీజేపీ ఆందోళన, ఆగ్ర హం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష మరోసారి రద్దయిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్య క్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ వేర్వేరు ప్రకటనల్లో ధ్వజమె త్తారు.

సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ అసమర్థ ప్రజాపా లన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కారణంగానే.. వరుసగా రెండోసారి రాష్ట్రంలో గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడ్డాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది యువతలో నైరాశ్యం నింపేలా కేసీఆర్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజ మెత్తారు. ఈ మేరకు ఆయన శనివారం ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల చేశారు.

ఇటీవలే జరిగిన పేపర్‌ లీక్‌ ఘటన, తదనంతర పరిణామాల నేపథ్యంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం కాస్త జాగ్రత్తగా వ్యవహ రిస్తుందనుకుంటే.. మళ్లీ అదే అస మర్థత, అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని  ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్‌–1 పరీక్షల నిర్వహణ విషయంలో సర్కారు నిర్లక్ష్యాన్ని కొందరు హైకోర్టు దృష్టికి తీసు కెళ్లడంతో.. పరీక్షలను రద్దుచేయ డం మినహా న్యాయస్థానం ముందు వేరే అవకాశమే లేకుండా పోయిందని పేర్కొ న్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు భద్రత, భరోసా కల్పించలేని కేసీఆర్‌ ప్రభుత్వానికి అధి కారంలో ఉండే నైతిక అర్హత లేదని విమర్శించారు.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ రాజీనామా చేయాలి: అరుణ డిమాండ్‌ 
టీఎస్‌పీఎస్‌సీని వెంటనే ప్రక్షాళన చేయాలని, చైర్మ న్‌ ఈ ఘటనకు భాద్యత వహించి తక్షణమే రాజీ నామా చేయాలని డీకే అరుణ డిమాండ్‌ చేశారు.  గ్రూప్‌ –1 పరీక్షలు రాసిన అభ్యర్థులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందజేయాలన్నారు. కేసీ ఆర్‌ సర్కార్‌కు మద్యం నోటిఫి కేషన్‌పై ఉన్న శ్రద్ధ, ఉద్యోగ నోటిఫికేషన్‌ పై లేదని విమర్శించారు.

ప్రభుత్వానికి సిగ్గుండాలి: ఈటల ధ్వజం
కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టి లాంటిదని, ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో పైసలు, మద్యం పంచుడు ఇవన్నీ కాదని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ మేల్కొని పాలనపై దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top