కేసీఆర్ దళితుడిని సీఎం చేయలేదు: ఈటల | Karimnagar: Etela Rajender Fires On Cm Kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ దళితుడిని సీఎం చేయలేదు: ఈటల

Published Fri, Jul 23 2021 1:13 PM | Last Updated on Fri, Jul 23 2021 1:25 PM

Karimnagar: Etela Rajender Fires On Cm Kcr - Sakshi

సాక్షి, కరీంనగర్: కేసీఆర్ దళితుడిని సీఎం చేయలేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు. గతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ప్రకటించిన కేసీఆర్‌ ఆ మాటను నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఓట్ల కోసమే దళిత బంధు ఇస్తామంటున్నారని విమర్శించారు. తాజా పరిణామాలు చూస్తుంటే హుజురాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక తేది ఎప్పుడని స్పష్టంగా తెలియకపోయినా ఇప్పటినుంచే రాజకీయ పార్టీల నేతలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మాటల యుద్ధాలు అప్పుడే మొదలయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement