సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ | John Wesley Appointed As Cpm Telangana State Secretary | Sakshi
Sakshi News home page

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ

Jan 28 2025 7:12 PM | Updated on Jan 28 2025 7:56 PM

John Wesley Appointed As Cpm Telangana State Secretary

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ నియమితులయ్యారు.

సాక్షి, సంగారెడ్డి: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ నియమితులయ్యారు. 60 మందితో సీపీఎం నూతన కార్యవర్గం ఏర్పాటు కాగా, 70 ఏళ్లు దాటిన నేతలకు రాష్ట్ర కమిటి నుంచి ఉద్వాసన పలికారు. తమ్మినేని వీరభద్రం, సీతారాములు, నర్సింగరావులకు సీపీఎం రాష్ట్ర కమిటీలో అవకాశం దక్కలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అమరచింతకు చెందిన జాన్ వెస్లీ.. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేశారు.

అయితే, సీపీఎం నూతన రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎన్నికయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. సంగారెడ్డిలో జరుగుతున్న సీపీఎం 4వ రాష్ట్ర మహాసభలు నేటితో ముగిశాయి. చివరి రోజు మంగళవారం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక జరిగింది. అనంతరం నూతన రాష్ట్ర కార్యదర్శిగా  జాన్ వెస్లీని ఆ కమిటీ ఎన్నుకోనుంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement