
సాక్షి, చిత్తూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తే సీఎం చంద్రబాబుకు వణుకుపుడుతోంది. వైఎస్ జగన్ ఈ నెల 9న బంగారుపాళెం మామిడి రైతులను పరామర్శించనున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో అలజడి రేగుతోంది. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కష్టాలు పడుతున్నారు. రైతులను జ్యూస్ ఫ్యాక్టరీలు దోచుకుంటున్నాయి. కిలో 3 నుంచి 4 రూపాయలకు కొనుగోలు చేస్తూ.. నిలువు దోపిడీ చేస్తున్నాయి.
ఈ నెల 9న వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కిలో ఆరు రూపాయలకు కొనేందుకు జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ సిద్ధమైంది. వైఎస్సార్‌సీపీ హయాంలో కిలో 26 రూపాయలకు మామిడి అమ్మకాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మామిడి ధర తగ్గిపోయింది. జ్యూస్ ఫ్యాక్టరీలు వద్ద క్యూలైన్‌లో టోకెన్లు ఇచ్చి తక్కువ ధరకే దోచుకుంటున్నాయి. చాలా చోట్ల 3 నుంచి 4 రూపాయలకే జ్యూస్ ఫ్యాక్టరీలు దోచుకుంటున్నాయి.
వైఎస్ జగన్ పర్యటన ఇలా..
ఈనెల 9న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో కోలారు, ముళబాగిళు, ఏపీ బోర్డర్ గండ్రాజుపల్లి, నాలుగు రోడ్లు, పలమనేరు బైపాస్ మీదుగా బంగారుపాళెంకు చేరుకుంటారు.
